Site icon HashtagU Telugu

Traffic Restrictions: ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic

Traffic

బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. సోమాజిగూడ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగే రహదారిలో ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్‌ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.