Direct Tax Collection: ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారీ జంప్.. గ‌తేడాదితో పోలిస్తే 17.30 శాతం వృద్ధి, ఐటీఆర్‌ల సంఖ్య కూడా రెట్టింపు..!

దేశంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (Direct Tax Collection) రూ.18.38 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది.

Published By: HashtagU Telugu Desk
New Tax Rules

New Tax Rules

Direct Tax Collection: దేశంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (Direct Tax Collection) రూ.18.38 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 17.30 శాతం పెరిగింది. CBDT విడుదల చేసిన డేటా ఫిబ్రవరి 10 వరకు వ‌సూలళ్లు చేసిన ప‌న్నుల గురించి మాత్ర‌మే స‌మాచారం ఇచ్చింది.

నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా రూ.15.60 లక్షల కోట్లకు చేరాయి

దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే 20.25 శాతం పెరిగి రూ.15.60 లక్షల కోట్లకు చేరుకుందని సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఆదివారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలలో 80.23 శాతం. ఇది కాకుండా ఫిబ్రవరి 10 వరకు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా గతేడాదితో పోలిస్తే 17.30 శాతం పెరిగి రూ.18.38 లక్షల కోట్లకు చేరాయి.

కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను గణాంకాలు కూడా పెరుగుతున్నాయి

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్ను గణాంకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని CBDT తెలిపింది. దీనితో పాటు కార్పొరేట్ ఆదాయపు పన్ను (సిఐటి),యు వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) గణాంకాలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. కార్పొరేట్ ఆదాయపు పన్ను 13.57 శాతం, వ్యక్తిగత ఆదాయపు పన్ను 26.91 శాతం పెరిగింది. CBDT డేటా ప్రకారం.. ఫిబ్రవరి 10 వరకు 2.77 లక్షల కోట్ల రూపాయల రీఫండ్‌లు కూడా జారీ చేయబడ్డాయి.

Also Read: BJP Rajya Sabha Candidate List : 14 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బిజెపి

10 ఏళ్లలో ఐటీఆర్‌ల సంఖ్య రెట్టింపు అయింది

భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం..గత 10 సంవత్సరాలలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య రెట్టింపు అయి 7.78 కోట్లకు చేరుకుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ఐటీఆర్‌ల సంఖ్య 104.91 శాతం పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 3.8 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.

We’re now on WhatsApp : Click to Join

ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా 160.52 శాతం పెరిగాయి

CBDT డేటా ప్రకారం.. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా ఇదే కాలంలో 160.52 శాతం పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.6,38,596 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.16,63,686 కోట్లకు పెరిగాయి. ఈ పదేళ్లలో ప్రత్యక్ష పన్ను, జీడీపీ నిష్పత్తి కూడా 5.62 శాతం నుంచి 6.11 శాతానికి పెరిగింది.

  Last Updated: 12 Feb 2024, 12:23 AM IST