IND vs WI 2nd ODI: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ట్రబుల్ లో పడింది. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పట్టారు. శుభారంభం బాగున్నప్పటికీ మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఇషాన్ కిషన్ 55 పరుగులతో ఆకట్టుకోగా, గిల్ 34 పరుగులు చేశాడు. ఆ తరువాత అక్షర్ పటేల్ ఒక పరుగు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ హార్దిక పాండ్య పెవిలియన్ చేరుకున్నాడు. పాండ్య 7 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన సంజు శాంసన్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. సంజు 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 25 ఓవర్లకే సగం జట్టు కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. 24.1 ఓవర్ల సమయానికి కేవలం 113 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇన్నింగ్స్ లో విండీస్ ఆటగాళ్లు అద్భుతంగ బౌలింగ్ చేశారు. వర్షం కారణంగా మ్యాచ్ కి అంతరాయం ఏర్పడింది.
IND vs WI 2nd ODI: కుప్పకూలిన టీమిండియా . కష్టాల్లో భారత్

New Web Story Copy (93)