Corona Cases: భారత్‌లో భారీగా కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..?

మంగళవారం భారత్‌లో కరోనా కేసుల (Corona Cases)సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3,038 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 01:39 PM IST

మంగళవారం భారత్‌లో కరోనా కేసుల (Corona Cases)సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 3,038 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,179. భారత్‌లో కోవిడ్ కేసులు అధిక సంఖ్యలోనే నమోదవుతున్నాయి. రోజుకూ మూడు వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 21,179 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

సోమవారం 3641 కేసులు నమోదు

అంతకుముందు సోమవారం 3641 కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కనుగొనబడ్డాయి. కరోనా కారణంగా 11 మంది మరణించారు. కేరళలో ఐదుగురు, మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,219కి పెరిగింది. అదే సమయంలో మొత్తం మృతుల సంఖ్య 5 లక్షల 30 వేల 892కి పెరిగింది. మొత్తం సోకిన వారి సంఖ్య 4,47,26,246 కు చేరుకుంది. వీరిలో కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 41 లక్షల 75 వేల 135 మంది.

భయపడవద్దు, అప్రమత్తంగా ఉండండి: మన్సుఖ్ మాండవియా

దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల మధ్య దేశంలో ఒమిక్రాన్ ఉప-వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరగలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం అన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

కరోనా కేసుల్లో విజృంభణ

గత కొన్ని రోజులుగా భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1న 2994 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు కనుగొనబడ్డాయి. ఏప్రిల్ 2న 3,824, ఏప్రిల్ 3న 3,641 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు, కొత్త తరహా కరోనా వైరస్‌ను ల్యాబొరేటరీలో గుర్తించామని, దానిని కూడా అధ్యయనం చేస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కొత్త ఫార్మెట్‌తో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కొత్త కోవిడ్ -19 కేసులు పెరగడానికి వైరస్ ఎక్స్‌బిబి 1.16 వేరియంట్ వ్యాప్తి కూడా కారణమని ఆయన అన్నారు.

విమానాల్లో ప్రయాణీకులు మాస్క్‌లు ధరించాలని సూచనలు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఫిబ్రవరి 10, 2023) జారీ చేసిన అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలు విమానాలలో మాస్క్‌లను ఉపయోగించాలని సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, H3N2 వైరస్ గురించి ఆందోళన చెందుతున్న రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ విమానాలలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడాన్ని తిరిగి విధించే ప్రతిపాదన ఏమైనా ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు.