Indian Aid:ఉక్రెయిన్‌కు భారత్ మానవీయ సాయం!

ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 05:49 PM IST

ఉక్రెయిన్‌కు భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా 26 రకాల మందులకు సంబంధించి 12 వ విడత సహాయాన్ని ఉక్రెయిన్ కి పంపినట్టు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్ వెల్లడించింది. వీటిలో తీవ్ర గాయాల చికిత్సలో ఉపయోగించే హెమోస్టాటిక్ బ్యాండేజ్ లు కూడా ఉన్నాయి. సమితిలో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి, రాయబారి రుచిరా కాంబోజ్ ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు.

ఉక్రెయిన్ విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందించామని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే గడచిన 6 నెలల్లో ఉక్రెయిన్, పరిసర దేశాలకు 11 విడతలు వివిధ రకాల వస్తువుల మానవీయ సహాయాన్ని భారత్ అందించిందని ఈ సహాయం 97.5 టన్నులుంటుందని ఆమె పేర్కొన్నారు. గత ఫిబ్రవరి, మార్చిలో 22,500 మంది భారతీయులను ఆ ప్రాంతం నుండి తరలించాడనికి ఉక్రెయిన్ పరిసర దేశాలు సహాయం చేశాయని ఆమె తెలిపారు. ఏ దేశానికైనా ఆపన్న హస్తం అందించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రుచిరా కాంబోజ వివరించారు.