Target China : సరిహద్దులలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తోంది.
దీంతో దానికి చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలపై ఇండియా ఫోకస్ పెట్టింది.
భవిష్యత్ లో చైనా తో యుద్ధమే వస్తే.. దాని నడ్డి విరిచే స్కెచ్ గీస్తోంది.
యాక్షన్ చేస్తే .. రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా చైనా, పాకిస్తాన్ లకు రియాక్షన్ ఇస్తోంది. వాటి నుంచి పొంచి ఉన్న రిస్క్ దృష్ట్యా ఇండియా ఇప్పుడు అడ్వాన్స్డ్ మిస్సైల్స్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టింది. చైనాలోని ప్రధాన నగరాలన్నీ టార్గెట్ చేయగల (Target China) మిస్సైళ్ళ తయారీపై ఫోకస్ పెట్టింది. దీనిపై స్వీడన్‌కు చెందిన థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ఒక నివేదిక విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన సిప్రీ ఇయర్‌బుక్ 2023లో ఈ వివరాలను ప్రస్తావించారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్ళను తయారు చేయాలని ఇండియా యోచిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ వద్ద 164 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈనేపథ్యంలో ఇండియా క్షిపణుల రేంజ్ పై ఒక లుక్ వేద్దాం..
1983లో ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో..
1983లో క్షిపణుల రూపకల్పన కోసం Integrated Guided Missile Development Programme (IGMDP)ను ఇండియా ప్రారంభించింది. దీనికి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. 2008లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. IGMDPలో భాగంగా ఆరు క్షిపణులను రూపొందించారు. అవి.. అగ్ని, అస్త్ర, పృథ్వి, ఆకాశ్, త్రిశూల్, నాగ్.
Also read : Supersonic Brahmos: రూ.1700 కోట్ల భారీ డీల్.. త్వరలో సైన్యానికి డ్యూయల్ రోల్ “బ్రహ్మోస్” మిస్సైల్స్ !!
అగ్నిక్షిపణి సామర్ధ్యాలు.. (ఉపరితలం నుంచి ఉపరితలం)
-
అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి 700 నుంచి 1250 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
-
అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి 2000 నుంచి 3000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
-
అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి 3500 నుంచి 5000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
-
అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి 3000 నుంచి 4000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
-
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి 5000 నుంచి 8000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
-
అగ్ని-6 బాలిస్టిక్ క్షిపణి 8000 నుంచి 10000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా అభివృద్ధి దశలో ఉంది.
Also read : Brahmos Missile : పాక్ పై భారత్ `మిస్సైల్ `కమామీషు