ప్రత్యర్ధి నుంచి ఈ మాత్రం పోటీ లేని వేళ టీమ్ ఇండియా ఖాతాలో మరో వైట్ వాష్ ఘనత చేరింది. శ్రీలంకతో జరిగిన మూడో టీ ట్వంటీ లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా లంక ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక తొలి ఓవర్ నుంచే తడబడింది. సిరాజ్ మొదటి ఓవర్ లోనే గునలతికను ఔట్ చేశాడు.
ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన లంకను మరోసారి శనక కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. 38 బంతుల్లో 9 ఫోర్లు , 2 సిక్సర్లతో 74 రన్స్ చేశాడు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ 2 , సిరాజ్ , హర్షల్ పటేల్ , రవి బిష్ణోయ ఒక్కో వికెట్ పడగొట్టారు.
చేజింగ్ లో భారత్ కూడా తడబడింది. ఓపెనర్లు సంజు శాంసన్, కెప్టెన్ రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ చెలరేగి ఆడాడు. పస లేని లంక బౌలర్లను ఆటాడుకున్న అయ్యర్ కేవలం 45 బంతుల్లోనే 73 రన్స్ చేశాడు.
దీపక్ హుడా 21 రన్స్ కు ఔటవగా…చివర్లో జడేజా 22 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ 16.5 ఓవర్లలోనే టార్గెట్ చేదించింది. ఈ విజయంతో సీరీస్ ను 3-0తో స్వీప్ చేసింది. అలాగే టీ ట్వంటీ క్రికెట్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన ఆఫ్గనిస్తాన్ రికార్డును సమం చేసింది. మూడు మ్యాచ్ ల్లోనూ అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ దక్కాయి. అలాగే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా 3 టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది.
Pic Courtesy- BCCI/Twitter
CHAMPIONS #TeamIndia 🎉@Paytm #INDvSL pic.twitter.com/Zkmho1SJVG
— BCCI (@BCCI) February 27, 2022