Site icon HashtagU Telugu

IND vs NZ: ఆరంభం అదిరింది.. న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

ind vs nz

Resizeimagesize (1280 X 720)

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 349 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 49.2 ఓవర్లలో కివీస్ 337 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్(208)పరుగులతో అదరగొట్టగా.. బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు. కాగా.. కివీస్ బ్యాట్స్‌మెన్ బ్రేస్‌వెల్(140) సెంచరీతో రాణించాడు.

ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో బుధవారం జ‌రిగిన మొదటి వన్డేలో భార‌త (IND vs NZ) జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 350 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 50 ఓవ‌ర్ల‌లో  337 ప‌రుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. కివీస్ జట్టులో బ్రాస్ వెల్ (140) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతనికి తోడుగా జట్టును విజయతీరాలకు చేర్చే ఇన్నింగ్స్ మాత్రం ఎవరూ ఆడలేదు. టీమిండియా బౌలర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు, హార్దిక్, షమీ చెరో వికెట్ తీసి టీమిండియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Also Read: Khammam BRS Sabha: కేసీఆర్ సంచలనం.. దేశ రైతులకు ఉచిత విద్యుత్!

మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 349 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ గిల్ ఈ మ్యాచ్ లో 208 పరుగులు సాధించాడు. గిల్ డబల్ సెంచ‌రీ బాదడంతో భారత జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 349 ప‌రుగులు చేసింది. గిల్ 208 స్కోర్‌తో నిలిచాడు. సెంచ‌రీ వరకు నిదానంగా ఆడిన గిల్ ఆ త‌ర్వాత మరింత దూకుడుగా ఆడాడు. గిల్ మొత్తంగా 149 బంతుల్లోనే 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (38 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్ లతో 34) కూడా రాణించాడు. ఈ విజ‌యంతో భార‌త జ‌ట్టు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Exit mobile version