Site icon HashtagU Telugu

World Championship Title: ఖో ఖో ప్రపంచ కప్ 2025.. ఛాంపియ‌న్‌గా నిలిచిన భార‌త్ జ‌ట్టు!

World Championship Title

World Championship Title

World Championship Title: ఖో ఖో ప్రపంచకప్ 2025లో నేపాల్‌ను (World Championship Title) 78-40తో ఓడించి భారత మహిళల జట్టు చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది. ఆరంభం నుంచే భారత మహిళా క్రీడాకారులు అద్భుతమైన ఆటను ప్రదర్శించి ప్రత్యర్థి జట్టును మట్టికరిపించారు. ప్రియాంక ఇంగ్లే సారథ్యంలో భారత్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.

భారత్ 6 బ్యాచ్‌లను తొలగించింది

ఖో ఖో వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో భారత్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌ను పరిశీలిస్తే.. మొదటి నుండి భారత ఆటగాళ్లు ఆటపై పట్టు సాధించారు. ఆరంభం నుంచే నేపాల్ డిఫెండర్లపై టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తొలుత టాస్‌ గెలిచిన నేపాల్‌ కెప్టెన్‌ డిఫెన్స్‌ ఎంచుకున్నాడు. కానీ నేపాల్‌కు ఈ నిర్ణయం తప్పని రుజువైంది. నేపాల్‌పై భారత్ తొలి టర్న్‌లోనే 34 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ అటాకర్లు ఒక్క పాయింట్ కూడా సాధించ‌లేదు. అదే సమయంలో నేపాల్‌కు చెందిన 6 బ్యాచ్‌లను అవుట్ చేసి భారత ఆటగాళ్లు సంచ‌ల‌నం సృష్టించారు.

కాగా రెండో టర్న్‌లో డిఫెన్స్‌కి వచ్చిన టీమ్‌ఇండియా డిఫెండర్లు నేపాల్‌ ధాటికి పరుగులు తీశారు. ఈ సమయంలో భారత ఆటగాళ్లు కూడా 1 పాయింట్‌ సాధించారు. ఇది కాకుండా డ్రీమ్ రన్ ద్వారా భారత్ 1 పాయింట్ కూడా సాధించింది. నాలుగో టర్న్‌లోనూ భారత ఆటగాళ్లు నేపాల్‌ ధాటికి ఆధిపత్యం చెలాయించలేకపోయారు. ఈ క్రమంలో భారత్ దాదాపు తన విజయాన్ని ఖాయం చేసుకుంది. నేపాల్‌ను గేమ్ నుండి తొలగించింది. చివరికి భారత్ 78-40తో విజయం సాధించి ప్రపంచదేశాల్లో తన పతాకాన్ని రెపరెపలాడించింది.

Also Read: Ranji Trophy: రంజీ ట్రోఫీలో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన స్టార్ ఆట‌గాళ్లు వీరే!

భారత్ వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది

టోర్నీ ఆద్యంతం భారత ఆటగాళ్ల ప్రదర్శన బలంగా ఉంది. వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ద్వారా భారత్ ఖో ఖో వరల్డ్ కప్ 2025 ట్రోఫీని గెలుచుకుంది. భారత్ 4 మ్యాచ్‌ల్లో 100 పాయింట్లకు పైగా సాధించింది. దీంతోపాటు దక్షిణ కొరియాపై 175 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు.