Site icon HashtagU Telugu

India-Australia: భారత్ -ఆస్ట్రేలియాల చారిత్రాత్మక ఒప్పందం..!!

India Australia

India Australia

భారత్ -ఆస్ట్రేలియాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యానికి సంబంధించి ఈ చారిత్రత్మాక ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్యానికి ఈ ఒప్పందం వీలు కలిపిస్తుంది. ఎగుమతుల పరంగా ఉన్న ఎన్నో అవరోధాలు ఈ ఒప్పందం ద్వారా తొలగిపోనున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న 27 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం…వచ్చే ఐద సంవత్సరాల్లో 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ టెహాన్ తో కలిసి…పీయూష్ గోయల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు దేశాల ప్రధానులు హాజరయ్యారు. భారత్ -ఆస్ట్రేలియా భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని…ఆస్ట్రేలియాకు భారత్ నుంచి ఎగుమతులు గత ఏడాదిలో ఎంతో పెరిగాయి. చర్చలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని గోయల్ ప్రకటించారు.

చాలా తక్కువ కాలంలోనే ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం రెండు దేశాల మధ్య ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా మోదీ ప్రకటించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇది నీటి విప్లవం వంటిందన్నారు. గత కొన్ని వారాల్లో భారత్ -ఆస్ట్రేలియా ప్రధానులు వర్చువల్ గా కలుసుకోవడం మూడోసారి. కొత్త ఒప్పందంతో ఆస్ట్రేలియా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే 85శాతం ఉత్పత్తులపై టారిఫ్ లను కేంద్రం తొలగిస్తుంది. వీటి విలు 12.6 బిలియన్ డాలర్లు. కాగా ఈ టారిఫ్ లు తొలగిపోయే ఆస్ట్రేలియా ఉత్పత్తుల్లో గొర్రెమాంసం, వూల్, కాపర్, బొగ్గు, అల్యూమినియా. రాక్ లాబ్ స్టర్ వంటి కీలకమైనవి ఉన్నారు.

ఇక భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతయ్యే వాటిల్లో 96 శాతంపై టారిఫ్ లు ఆ దేశం తొలగించనుంది. ప్రపంచంలో నేడు తెరుచుకుంటున్న అతిపెద్ద ఆర్థిక ద్వారాలు ఇవే అంటూ ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్ ప్రకటించారు.