Site icon HashtagU Telugu

IND Vs Australia: 262 పరుగులకు ఇండియా ఆల్ ఔట్.. అక్షర్ పటేల్.. అశ్విన్‌తో కలిసి శతక భాగస్వామ్యం!

India vs Bangladesh

India vs Bangladesh

ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతోంది. భారత్ స్పిన్ తో దెబ్బతో కొడితే.. ఆసీస్ కూడా తగ్గేదేలే అంటూ బౌలింగ్ తో చెలరేగుతోంది. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. 83.3 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయిన టీమిండియా 262 పరుగులు సాధించింది. అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 పరుగులు సాధించి ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది.

భారత జట్టులో అక్షర్ పటేల్ అత్యధికంగా 74 పరుగులు సాధించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 44 పరుగులు, రవి చంద్రన్ అశ్విన్ 37 పరుగులు, రోహిత్ శర్మ 32 పరుగులు, రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన ల్యాన్ ఐదు వికెట్లు తీశాడు. తర్వాత ముర్ఫీ, మాథ్యూ కునెమాన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. అయితే బ్యాటర్లు విఫలమైన చోటా  భారత బౌలర్లు అక్షర్ పటేల్.. అశ్విన్‌తో కలిసి శతక భాగస్వామ్యం నమోదు చేయడం గమనార్హం.