Independence Day 2023 : గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీఎస్ శాంతి కుమారి

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి వేడుకల

  • Written By:
  • Updated On - August 14, 2023 / 06:01 PM IST

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేసేందుకు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని, త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆమె ఆదేశించారు. అదేవిధంగా, ఆగస్ట్ 15న గోల్కొండ కోటలోని జ‌రిగే స్వాతంత్య్ర దినోత్సవం 2023 వేడుకల దృష్ట్యా.. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమలు చేయ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వరకు సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని, రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు ప్రవేశం ఉంటుందని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు. A (గోల్డ్), A (పింక్), B (నీలం) కారు పాస్‌లు ఉన్నాయ‌ని తెలిపారు. ఉదయం 7 నుండి 11 గంటల వరకు జెండా ఆవిష్క‌ర‌ణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.