Site icon HashtagU Telugu

IND vs SL: మూడు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన లంక

IND vs SL

IND vs SL

IND vs SL: భార‌త జ‌ట్టు ఆసియా క‌ప్ ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ ఢీకొంటోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతోంది. ఇరుజ‌ట్లు ఈ మోగాటోర్నీ టైటిల్ పోరులో త‌ల‌ప‌డ‌డం ఇది ఎనిమిదోసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్లు 20 సార్లు తలపడ్డాయి. అయితే ఇరు జట్ల రికార్డులు సరి సమానంగా ఉన్నాయి. భారత్ పది గెలిచింది, పది ఓడిపోయింది. భారత్-శ్రీలంక మధ్య మొత్తం 166 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 97 గెలుపొందగా, శ్రీలంక 57 గెలిచింది. 1 మ్యాచ్ టై కాగా 11 ఫలితం లేదు.

ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. గాయపడిన తిక్షణా స్థానంలో శ్రీలంక దుషాన్ హేమంతను చేర్చుకుంది. అదే సమయంలో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు భారత జట్టులో చోటు కల్పించారు.

మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంక మొదటి వికెట్ కోల్పోయింది. జ‌స్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవ‌ర్లోనే వికెట్ తీశాడు. శ్రీ‌లంక ఓపెనర్ కుశాల్ పెరీరా డకౌట్ గా వెనుదిరిగాడు. మొదటి ఓవర్ మూడో బంతికి పెరీరా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ డైవ్ చేస్తూ అద్బుతంగా అందుకున్నాడు. దాంతో, లంక ఒక్క ప‌రుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సధీర సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీ అయ్యాడు.  అదేవిధంగా పతుమ్ నిషాంకాతో కలిపి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Also Read: Tata Nexon EV: మార్కెట్లోకి టాటా నెక్సాన్ ఈవీ కార్ లాంచ్.. ధర ఫీచర్స్ ఇవే?