IND VS Pak: వన్డే వరల్డ్ కప్ 2023 మహా సంగ్రామంలో పాకిస్తాన్‌తో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన ఇండియా మొదట ఫీల్డింగ్ చేస్తోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్, పాక్ జోరుగా కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. 13 ఓవర్లలో 74 పరుగులు చేసిన పాకిస్థాన్ 2 మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. 2 కీలక మైన వికెట్లు కోల్పోవడంతో పాక్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇప్పటికే షఫిక్, ఇమామ్ ఔట్ కాగా, రిజ్వాన్ ఎల్ బీ డబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం రిజ్వాన్ (2), బాబార్ (16) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Also read: CBN : `న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో విన్నూత నిరసనకు టీడీపీ పిలుపు