Site icon HashtagU Telugu

IND vs BAN: టీమిండియా సంచ‌ల‌న విజ‌యం.. సిరీస్‌ క్లీన్ ‌స్వీప్!

IND vs BAN

IND vs BAN

IND vs BAN: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ (IND vs BAN) ఘన విజయం సాధించింది. 26/2తో ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన బంగ్లా 146 పరుగులకు ఆలౌట్ అయ్యి.. భారత్ ముందు 95 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 3 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి విజయం సాధించింది. జైస్వాల్(51), కోహ్లీ(29)తో రాణించారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.

Also Read: India vs Bangladesh Day 5: బంగ్లా 146 ప‌రుగుల‌కే ఆలౌట్‌.. 95 ప‌రుగులు చేస్తే భార‌త్‌దే సిరీస్‌..!

కాన్పూర్ టెస్టులో వర్షం కారణంగా రెండు రోజుల పాటు ఆట జరగలేదు. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాన్పూర్ టెస్టులో భారత జట్టు ఐదో రోజు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ ను టీమ్ ఇండియా తుడిచిపెట్టేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ అండ్ కంపెనీ కేవలం 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 18వ సిరీస్‌ విజయం.

సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మొదటి రోజు వర్షం రావ‌డంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతోపాటు భోజన విరామ సమయంలో కూడా వర్షం ప‌డింది. మొదటి రోజు 35 ఓవర్లు మాత్రమే ఆట కొన‌సాగింది. ఇందులో బంగ్లాదేశ్ 107/3 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో రోజు వర్షం కార‌ణంగా ఆట ర‌ద్దైంది. మూడోరోజు కూడా ఆట ర‌ద్దైంది.

మ్యాచ్ నాల్గవ రోజు భారత జట్టు బంగ్లాదేశ్‌ను 233/10 పరుగులకు పరిమితం చేసింది. అదే రోజు తన మొదటి ఇన్నింగ్స్‌లో 285/9 పరుగులు (34.4 ఓవర్లలో) చేసిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ తరఫున ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 72 పరుగుల వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. కేఎల్ రాహుల్ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. నాలుగో రోజు బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌కు రంగంలోకి దిగింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 11 ఓవర్లలో 26/2 పరుగులు చేసింది.

ఆ తర్వాత ఐదో రోజు తన రెండో ఇన్నింగ్స్‌ను ఆడేందుకు వ‌చ్చిన‌ బంగ్లాదేశ్ తొలి సెషన్‌లో 146/10 పరుగులకే ఆలౌట్ అయి భారత్‌కు 95 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. రెండో సెషన్‌లోనే స్వల్ప లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయం సాధించింది.