Ind vs Aus ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించింది. అటు బ్యాట్స్ మెన్, ఇటు బౌలర్స్ ఇద్దరు ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయానికి కారణమయ్యారు. ఆసీస్ పై 99 పరుగుల తేడాతో రెండో వన్డే గెలిచిన భారత్ 3 వన్డేల సీరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
2వ వన్డే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత్ జట్టులో ఓపెనర్ శుబ్ మన్ గిల్ 97 బంతుల్లో 104 పరుగులు చేయగా వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేశాడు. కెప్టెన్ కే.ఎల్ రాహుల్ కూడా బాధ్యతాయుతమైన ఆట ఆడి జట్టుకి 55 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ టీం ఇండియా భారీ స్కోర్ చేసేలా చేసింది. సూర్య కుమార్ యాదవ్ 37 బంతుల్లో 72 నాటౌట్ గా చెలరేగిపోయాడు. ఇషాన్ కిషన్ కూడా 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా 9 ఓవర్ల తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలుగగా ఆటని 33 ఓవర్లకు కుదించి 317 పరుగులు లక్ష్యం ఇచ్చారు. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో 150, 160 లోపే ఆలౌట్ అవుతారని అనిపించగా ఎలాగోలా 217 దాకా లాకొచ్చారు. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 3, షమి ఒక వికెట్ తీశారు.
Als0 Read : Pooja Hegde : ప్రేమలో పూజా హెగ్దే.. త్వరలోనే పెళ్లి..?