Site icon HashtagU Telugu

IND-NZ : భారత్, కివీస్ మ్యాచ్ రద్దు…ఎందుకో తెలుసా ?

Rain

Rain

టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 రౌండ్ కు ముందు మరో వార్మప్ మ్యాచ్ తో సత్తా చాటుదామనుకున్న భారత్ ఆశలపై వరుణుడు నీళ్ళు చల్లాడు. వర్షం కారణంగా భారత్ , కివీస్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ రద్దైంది. బ్రిస్బేన్ లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పలుసార్లు పరిస్థితిని పరిశీలించిన అంపైర్లు టాస్ పడకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తొలి వార్మప్ మ్యాచ్ లో ఆసీస్ పై గెలిచి జోరు మీదున్న టీమిండియాకు వర్షంతో రెండో మ్యాచ్ రద్దవడం నిరాశ కలిగించేదే. ముఖ్యంగా బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన షమీకి పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ లభించలేదు. ఆసీస్ పై వార్మప్ మ్యాచ్ ఆడిన షమీ ఒకే ఒక ఓవర్ వేసి 3వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ కు కూడా వర్షం అడ్డుపడే అవకాశాలున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకి కాకూడదని కోరుకుంటున్నారు. ఆదివారం జరగనున్న ఈ మెగా ఫైట్ కు సంబంధించిన టిక్కెట్లన్నీ ఎప్పుడో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

Exit mobile version