Covid updates: దేశంలో ‘పాజిటివిటీ’ పెరుగుతోంది!

  • Written By:
  • Publish Date - January 17, 2022 / 12:19 PM IST

భారత్‌లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్‌ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్‌లో రికవరీలు 94.27శాతంగా ఉన్నాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతుండంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూ ప్రకటన చేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు కరోనా కేసుల కట్టడికి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.