Tax Returns: ITR సరైన సమయానికి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

2021- 22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ చేయడానికి చివరి సమయం దగ్గర పడుతుంది. ఆదాయపు

  • Written By:
  • Publish Date - July 24, 2022 / 08:00 PM IST

2021- 22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ చేయడానికి చివరి సమయం దగ్గర పడుతుంది. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022 గా ఉంది. అయితే చాలామంది ఆదాయం పన్ను విధించదగిన పరిమితి కంటే తక్కువగా ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయడం ముఖ్యం కాదని అనుకుంటారు. మొత్తం ఆదాయం మినహాయింపు పరిమితిని మించి ఉంటే ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యమైనది. అయితే సమయానికి ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయకుంటే భారీగా జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పనులను ముందస్తుగా చేసుకుంటే ఎంతో మేలు.

మరి ఐటీఆర్ సమయానికి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందా.. సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలోని అన్ని బ్యాంకులు పన్ను రిటర్న్ కాపీ గురించి అడుగుతాయి. ఐటీఆర్ సహాయంతో బ్యాంకుల్లో రుణాలు పొందడం సులభం అవుతుంది. అలాగే వీసా దరఖాస్తు సమయంలో చాలా మంది ఎంబసీలు, కాన్సులేట్‌లు గత రెండేళ్లుగా ప్రయాణికుల ఐటీఆర్ ను కాపీని సమర్పించాలని కోరుతున్నారు. ఒకవేళ డాక్యుమెంటేషన్ పూర్తి అయినట్లయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్‌ను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.

అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం ఐటీఆర్‌ ఫైల్‌ చేసేవారికి గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంతో భర్తీ చేయవచ్చు. మీరు మీ ఐటీఆర్ ను సకాలంలో ఫైల్ చేసినట్లయితేనే ఈ ప్రయోజనం పొందవచ్చు. అయితే ఐటీఆర్ సకాలంలో దాఖలు చేయకపోతే ఆ వ్యక్తిపై ఐదు వేల రూపాయల వరకు జరిమానా చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే వ్యక్తి సమయానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీపై బ్యాంకులు తగ్గించిన టీడీస్ తిరిగి పొందవచ్చు.
ఐటీఆర్ చిరునామా, ఆదాయ రుజువుగా కూడా ఉపయోగించవచ్చు.