Hyderabad: దారుణం.. యువతులను నగ్నంగా చేసి ఫోటోలను తీసిన వ్యక్తి.. కానీ చివరికి?

సమాజంలో రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు మానసిక వేధింపుల సంఖ్య ఎక్కువ అవుతోంది. రాను

  • Written By:
  • Publish Date - December 5, 2022 / 08:10 PM IST

సమాజంలో రోజురోజుకీ ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలు మానసిక వేధింపుల సంఖ్య ఎక్కువ అవుతోంది. రాను రాను ఆడవారికి సమాజంలో రక్షణ కరువవుతోంది. మానవ సంబంధాలు మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఆడవారి పరిస్థితులను వారికి అనుగుణంగా లోబరుచుకొని వారిని చిత్రహింసల గురి చేయడం అత్యాచారాలు చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలో అమాయకమైన మహిళలను అమ్మాయిలను మాటలతో నమ్మించి వారి శరీర భాగాల ఫోటోలు వీడియోలను తీసి వ్యభిచార కొంపలకు పంపేవారు.

ఆ ఫోటోలు వీడియోలను చూసిన వారు ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి లేదా మహిళల ధరను నిర్ణయించేవారు. కాగా ఈ ఘటన ఒక సామాజిక కార్యకర్త ద్వారా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లాలోని రాజేశ్వర్‌ గ్రామానికి చెందిన సయ్యద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు. అతనికి కలబురిగి ప్రాంతానికి చెందిన వ్యభిచార కూపాలను నిర్వహించే గులాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త సాన్నిహిత్యంగా మారింది. గులాం మాటలు విన్న హుస్సేన్ హైదరాబాద్ కు వచ్చి పాతబస్తీలో తన బంధువుల వద్దకు వెళ్లి తాను పని కోసం వచ్చానని, ఇక్కడే ఉండి చూసుకుంటానని చెప్పి నమ్మించి వారిని అద్దెకు ఇప్పించాలని కోరడంతో హుస్సేన్ మాటలను నిజమే అని నమ్మిన అతని బంధువులు అతనికి ఒక అద్దె గదిని కూడా ఇప్పించారు.

ఈ నేపథ్యంలోనే ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన మహిళతో కలసి వ్యభిచారానికి అనువుగా ఉండే యువతుల కోసం గాలించేవారు. ఒంటరిగా కనిపించే అమ్మాయిలు, ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి పని ఉందని నమ్మబలికి రూమ్ కు తీసుకెళ్ళి వారిని ఫొటోలు తీసేవాడు. ముఖం, పాదాలు కనిపించకుండా మిగతా శరీర భాగాలు కనిపించే విధంగా ఫోటోలు వీడియోలను తీసి వాటిని కలబురిగిలోని గులాంకు వాట్సాప్ ద్వారా పంపేవాడు. వాటిని చూసి గులాం వారికి ధర నిర్ణయించేవాడు. అలా హుస్సేన్ ఒక వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలను సేకరించాడు. అయితే హుస్సేన్ ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన స్థానికులు ఆ విషయాన్ని ఒక చారిటీ ట్రస్ట్ కి తెలిపారు. అలాగే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కావాలనే హుస్సేన్ దగ్గరకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని అతని నమ్మించడంతో వారి మాటలు నిజమే అని నమ్మిన హుస్సేన్ తనతో పాటు గదికి తీసుకెళ్లాడు. అయితే విషయంతో పాటు వెళ్లిన వ్యక్తులు ముందుగానే పోలీసులకు సమాచారం అందించారు. అనుకున్న విధంగానే చాంద్రాయణగుట్ట పోలీసులు ఆ గది దగ్గరికి హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సెల్‌ఫోన్‌లో వీడియోలు, చిత్రాలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.