Site icon HashtagU Telugu

BRS Minister: మంత్రి సమక్షంలో కాంగ్రెస్ బిజెపి నుండి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు

Koppula Eshwar Imresizer

Koppula Eshwar Imresizer

BRS Minister: ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం నందగిరి, శాలపల్లి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ నారెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో  నందగిరి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ వార్డు సభ్యులు గర్వంద వెంకటేష్ గౌడ్, తో పాటు పార్టీ నాయకులు చేపూరి విక్రం, వినయ్, గోపు అజయ్ రెడ్డి, అశ్వత్ రెడ్డి, వెంకటేష్, రాజశేఖర్, శ్రీధర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, శివకృష్ణ, గణేష్ రెడ్డి, తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.

అనంతరం మాజీ ఎంపీపీ కాశెట్టి సత్తయ్య ఆధ్వర్యంలో శాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ  మాజీ  సర్పంచ్ బొడ్డు లింగయ్య, తో పాటు పార్టీ నాయకులు గుర్రాల శంకర్, బొడ్డు మహేష్, రమేష్ తుమ్మ మల్లేశం తదితరులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ రెండు గ్రామ నాయకుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.