Site icon HashtagU Telugu

Kerala: కేరళలో ఘోరం.. మహిళా డాక్టర్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన పేషెంట్!

Kerala Incident

Kerala Incident

Kerala: కేరళలో దారుణం చోటుచేసుకుంది. వైద్యం చేస్తుండగా మహిళా డాక్టర్‌ను ఓ రోగి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణ హత్య ఇప్పుడు కేరళలో సంచలనంగా మారింది. ఈ హత్య రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. కేరళలోని కొల్లాం జల్లాలోని కొట్టారక్కర ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే. .

కొట్టారక్క ప్రాంతంలో 23 ఏళ్ల వందనా దాస్ డాక్టర్ గా పనిచేస్తోంది. ఆమెను సందీప్ అనే ఉపాధ్యాయుడు కత్తెరతో దాడి చేసి చంపేశాడు. కత్తెరతో విచాక్షణారహితంగా దాడి చేసి ఉన్నాది పొడిపొడిచి హత్య చేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందీప్ ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే కుటుంసభ్యులతో గొడవ పడి కాలయంతో ఆస్పతిలో చికిత్స కోసం వచ్చాడు. సందీప్ కు వందనా దాస్ చికిత్స అందస్తుండగా ఆమెను కత్తెరతో పొడిచి చంపాడు.

వైద్యురాలిని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ హత్యపై కేరళలో రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార కమ్యూనిస్ట్ పార్టీపై విమర్శలు కురిపిస్తున్నాయి.ఈ క్రమంలో ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమై విచారణకు ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమగ్రమైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గల కారణాలను తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈఘటనపై కేరళ హైకోర్టు కూడా స్పందించింది. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఇక ఈ హత్యపై మానవ హక్కుల కమిషన్ సుమోటాగా విచారణ జరుపుతోంది. ఏడు రోజుల్లోగా హత్యపై తమకు నివేదిక సమర్పించాలని కొల్లాం జిల్లా ఎస్సీని ఆదేశించింది.