Site icon HashtagU Telugu

PM Modi: రాష్ట్రాలే పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలి!

Modi

Modi

ఇంధన ధరల పెరుగుదలపై తొలిసారిగా ప్ర‌ధాని మోడీ స్పందించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇంధన పన్నును తగ్గించాలని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ఇంధన ధరల పెరుగుదలపై ఆయన తొలిసారిగా స్పందించారు. గత నవంబర్‌లో ధరలను తగ్గించలేని కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆ పని చేయాలని ఆయన అన్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఇంధనంపై పన్ను తగ్గించలేదని, ఇప్పుడే తగ్గించాలని ఆయన అన్నారు.

కేంద్రం గత నవంబర్‌లో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. పన్ను తగ్గించాలని రాష్ట్రాలను కూడా అభ్యర్థించిందని మోడీ తెలిపారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు ఇప్పుడు వ్యాట్ తగ్గించి ప్రయోజనాలను ఇవ్వాలని అభ్యర్థించాన‌ని ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం సమస్యపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. సామాన్య ప్రజలకు అవ‌స‌ర‌మ‌వుతున్న‌ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి ఏమి చేస్తుందని ప్రశ్నించింది. ద్రవ్యోల్బణం 6.95 శాతం ఉండగా, బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5 శాతం మాత్రమేనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

Exit mobile version