Site icon HashtagU Telugu

Imran Khan : విమానం ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇమ్రాన్ ఖాన్..!!

Imran Khan

Imran Khan

పాక్ మాజీ ప్రధాని..ఇమ్రాన్ ఖాన్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ఇవాళ ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ నుంచి గుజ్రాన్ వాలాకు బయల్దేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే….విమానంలో ఆకస్మాత్తుగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం వెంటనే ల్యాండ్ అయ్యింది.

రోడ్డు మార్గంలో ఇమ్రాన్ ఖాన్ గుజ్రన్ వాలాకు చేరుకున్నారు. అక్కడ జరిగిన సభలో ఆయన భారత్ ను తెగపొగిడేసాడు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కూడా రష్యా నుంచి ఇండియా చమురును కొనుగోలు చేసిందని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.