Site icon HashtagU Telugu

Imran Khan: పెట్రోల ధరల తగ్గింపుపై… మోదీని ప్రశంసంచిన ఇమ్రాన్ ఖాన్.!!

Imran Khan Modi

Imran Khan Modi

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…భారత ప్రధానిని మరోసారి ప్రశంసించారు. పెట్రోలు, డీజిల్ పైఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడాన్ని ప్రస్తావించారు. అమెరికా నుంచి తీవ్రఒత్తిడి ఉన్నాకూడా రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకున్నారన్నారు.భారతదేశం క్వాడ్ లో భాగమైనప్పటికీ…అమెరికా నుంచి ఒత్తిడి ఎదుర్కొని ప్రజల కోసం రాయితీపై రష్యన్ చమురును కొనుగోలు చేసిదంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ లోని తమ ప్రభుత్వం కూడా ఇది సాధించేందుకు కృషి చేసిందన్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం సాయంతో తమ ప్రభుత్వం కూడా కృషి చేసిందని అన్నారు. అలాగే పాకిస్తాన్ ప్రస్తుత సర్కార్ తీరు పై ఆయన విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత్రుత్వంలోని ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థతో తలలేని కోడిలా నడుస్తోందని విమర్శించారు.