Bhatti: 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ రుణాల పథకం అమలుః భట్టి

  • Written By:
  • Updated On - March 9, 2024 / 05:55 PM IST

 

Mallu Bhatti Vikramarka:రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని… త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టేది లేదన్నారు.

read also :UPI In Nepal: నేపాల్‌లో యూపీఐ సేవలు ప్రారంభం..!

రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామన్నారు. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma houses) కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 12న మహిళా గ్రూపులకు(women groups)జీరో వడ్డీ(Zero interest) రుణాల పథకాన్ని అమలు ప్రారంభిస్తాం. ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తాం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం. మా ప్రభుత్వం మహిళలను మహాలక్ష్ములుగా గౌరవిస్తాం. గత ప్రభుత్వం.. ఆశ, అంగన్ వాడీ, ఆయాలకు నెల జీతాలు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వం 40వేల కోట్లు పెండింగ్ లో పెట్టింది. రాష్ట్రంలో ఉద్యోగులు అందరికీ మార్చి 1న జీతాలు ఇచ్చాం. బీఆర్ఎస్ కోసం కాదు.. ప్రజల కోసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం. ఆరు గ్యారంటీలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదు. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కొందరు విద్యుత్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టి కొచ్చింది. ఆ అధికారులపై చర్యలు తప్పవు. ఐటీఐ కాలేజీల్లో.. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చేందుకు ఎంవోయూ కుదిరింది. టాటా టెక్నాలజీస్ తో ప్రభుత్వం కుదుర్చుకుంది” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

read also : Janhvi Kapoor: చీర కట్టులో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. అందాల ఆరబోత మామూలుగా లేదుగా?

కాగా, విద్యుత్ ఛార్జీలు కూడా పెంచబోమని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎక్కువ విద్యుత్ వినియోగం జరుగుతున్నా తాము ఇస్తున్నామన్నారు. మరింత కరెంట్ వినియోగం పెరిగినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో 16వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కూడా సిద్ధమన్నారు. త్వరలో విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని తెలిపారు. విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. సోలార్ విద్యుత్‌ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 40,33,702 జీరో బిల్లులు ఇచ్చామన్నారు.