IndiGo Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో (IndiGo Flight) ఇలాంటి ఘటనే జరిగింది. ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు వెళుతున్న ఇండిగో విమానం ఇంజన్‌లో టేకాఫ్ తర్వాత సమస్య తలెత్తడంతో గందరగోళం నెలకొంది. దీంతో విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
ANI నివేదిక ప్రకారం.. ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు వెళుతున్న ఇండిగో విమానం 6E 5118 టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో గందరగోళం నెలకొంది. విమానంలోని ప్రయాణికులకు ఈ విషయం గురించి సమాచారం అందించారు. భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విమాన ఇంజన్‌లో స్వల్ప సాంకేతిక సమస్య తలెత్తిందని, ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నామని తెలియజేశారు. ఆ తర్వాత ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Also Read: Virat Kohli: క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు!
గోవా వెళ్లే ఇండిగో విమానంలో కూడా సమస్య
ఇండిగో ఎయిర్‌లైన్ తరఫున తెలియజేయబడిన వివరాల ప్రకారం.. ల్యాండింగ్ తర్వాత విమాన ఇంజన్‌ను పరిశీలించారు. విమానాన్ని అన్ని విధాలుగా తనిఖీ చేసిన తర్వాత అది ఇంఫాల్‌కు బయలుదేరింది. విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య ఉందనే విషయాన్ని ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. విమానం ఒక గంట పాటు గాలిలో ఉన్న తర్వాత హఠాత్తుగా ఢిల్లీకి మళ్లించబడిన వార్తతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే, ఇంతకుముందు మంగళవారం ఢిల్లీ నుంచి గోవాకు వెళుతున్న ఇండిగో విమాన ఇంజన్‌లో సమస్య తలెత్తడంతో గందరగోళం నెలకొంది. దీంతో ఆ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమాన తనిఖీ తర్వాత అది మళ్లీ గోవా విమానాశ్రయం కోసం బయలుదేరింది.