రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటే తక్కువగా నమోదైనట్టు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఆదిలాబాద్ లో అతితక్కువగా 3.5 డిగ్రీ సెలీసియస్ గా నమోదయింది. కోల్డ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యం లో ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నటు తెలిపింది. రానున్న రెండు మూడు రోజులు ప్రజలందరూ కూడా అప్రమతంగా ఉండాలని హెచరించింది. మొదటిసారిగా, హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే 3-4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
Telangana: ఆదిలాబాద్ లో అతి తక్కువగా..!

Winter