IMD Forecast: హైదరాబాద్‌లో రానున్న రెండు రోజుల్లో భారీగా వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. జూలై 4, 5 తేదీలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ పేర్కొంది. నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా తెలంగాణాలో ఇప్పటికే వర్షపాతం నమోదైంది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడ్డాయి. వికారాబాద్‌లో అత్యధికంగా 163.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అనేక జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. హైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33.1 డిగ్రీలు, 22.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి.
Read More: Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం వేధింపులకు మాయమైన అందాల తార.. ఎక్కడుంది ?