Site icon HashtagU Telugu

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత

48 Kg Gold Paste

48 Kg Gold Paste

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడిని విమానాశ్రయ సిబ్బందిని గురువారం అరెస్టు చేశారు. సీనియర్ కస్టమ్స్ అధికారి ప్రకారం.. నిందితుడు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయానికి వచ్చాడు. అతని లగేజీలో బంగారం లభ్యమైంది.

కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేసి, కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాశ్రయ సిబ్బందిని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.