Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు

  • Written By:
  • Updated On - June 21, 2024 / 11:47 PM IST

Dasoju: రేవంత్ రెడ్డి  TPCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే పద్దతులను స్వయంగా అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు అన్నారు. వీరి చర్యల ద్వారా రాజీవ్ గాంధీ తీసుకురాబడిన ప్రజాస్వామిక విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల పవిత్రతను, ఓట్లేసిన ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారని దాసోజు మండిపడ్డారు.

రెవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పూనుకుంటు తాను చేసిన ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నాయని, BRSparty యువ నాయకులను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామని,  వెంటనే విడుదల చేయాలని దాసోజు డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఉద్యమ పార్టీలో గుబులు రేగుతోంది. చాలామంది అధికార పార్టీ వైపు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.