ముంబైలోని ఐఐటీ పొవాయ్‌లో చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.విద్యార్థి అహ్మదాబాద్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఐఐటీ పొవాయ్‌లో బీటెక్ చదువుతున్నాడు. విద్యార్థి మూడు నెలల క్రితమే కోర్సులో చేరాడని.. మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారంతో ముగిశాయగా.. ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం హాస్టల్‌కు చేరుకుని విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపామని, గుజరాత్‌లోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోవై పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… చదువుల ఒత్తిడి వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
IIT Student : హాస్టల్ భవనంపై దూకి ఐఐటీ విద్యార్థి మృతి

Deaths