IIT-H Student Suicide : ఐఐటీ హైదరాబాద్‌ లో స్టూడెంట్ సూసైడ్‌.. ఆ లెటర్ లో ఏముందంటే ?

IIT-H Student Suicide : ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో కలకలం రేగింది.. "నా చావుకు ఎవరూ కారణం కాదు.. చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నాను" అని సూసైడ్‌ లెటర్‌ రాసి ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. 

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 02:59 PM IST

IIT-H Student Suicide : ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో కలకలం రేగింది.. 

“నా చావుకు ఎవరూ కారణం కాదు.. చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నాను” అని సూసైడ్‌ లెటర్‌ రాసి ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. 

ఎంటెక్ ఫస్టియర్ కోర్సు చేస్తున్న విద్యార్ధి మమైత నాయక్(21)  హాస్టల్‌ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

Also read : KTR Conspiracy : థాక్స్ వెనుక కోటానుకోట్ల లాజిక్

ఆ విద్యార్ధి  ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు.  సూసైడ్‌ లెటర్‌ ను స్వాధీనం చేసుకొని, విద్యార్ధి తల్లిదండ్రులకు సమాచారం అందించామని సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్‌ చెప్పారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మమైత నాయక్ రెండు వారాల క్రితమే (జూలై 26న)  క్యాంపస్‌లో చేరాడని ఐఐటీ హైదరాబాద్‌ అధికారులు చెబుతున్నారు.  అతడి  మృతదేహాన్ని(IIT-H Student Suicide) పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఐఐటీలో ఈ ఏడాది నలుగురు స్టూడెంట్స్  ఆత్మహత్యలు చేసుకున్నారు.గతేడాది కూడా ముగ్గురు స్టూడెంట్స్  సూసైడ్ చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్ కావడం వంటి సమస్యలకే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి స్టూడెంట్స్ దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఐఐటీ అధికారులు విద్యార్థులకు మోటివేషన్ కలిగించే కౌన్సెలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.