IIIT : ఫీజులు క‌డితేనే స‌ర్టిఫికేట్లు.. ట్రిపుల్ ఐటీ ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు షాక్ ఇచ్చిన అధికారులు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ఫైన‌ల్ ఇయ‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు ట్రిపుల్ ఐటీ

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 09:31 AM IST

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళ‌న చేస్తున్నారు. ఫైన‌ల్ ఇయ‌ర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు ట్రిపుల్ ఐటీ అధికారులు స‌ర్టిఫికేట్ల‌ను ఇవ్వ‌కుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఫీజులు చెల్లించ‌ని 4వేల మంది ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు స‌ర్టిఫికేట్ల‌ను ఆర్జేయూకేటీ నిలిపివేసింది.నూజివీడు, శ్రీకాకుళం. ఇడుపుల‌పాయ‌, ఒంగోలు క్యాంప‌స్‌ల‌లో స‌ర్టిఫికేట్ల‌ను జారీని అధికారులు నిలిపివేశారు. సాయంత్రంలోపు బ‌కాయిలు చెల్లించాల‌ని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్ అధికారులు డెడ్‌లైన్ విధించారు. విద్యాదీవెన ప‌థ‌కం ద్వారా వ‌చ్చే డ‌బ్బులు త‌ల్లుల ఖాతాలో జ‌మ అవుతున్నందున త‌మ‌కు ఫీజులు చెల్లించాల‌ని ఆర్జేయూకేటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే వివిధ కంపెనీల్లో సెలెక్టైన విద్యార్థులు స‌ర్టిఫికేట్ల‌ను స‌మ‌ర్పిచాల్సి ఉంది. కానీ యూనివ‌ర్సిటీ అధికారులు స‌ర్టిఫికేట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.