Site icon HashtagU Telugu

IGNOU Recruitment: 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్స్.. రూ.63,200 వరకూ జీతం

IGNOU Recruitment for 200 Junior Assistant Cum Typist Jobs.. Salary Up To Rs.63,200

200 Junior Assistant Cum Typist Jobs.. Salary Up To Rs.63,200

IGNOU Recruitment : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) డిస్టన్స్ ఎడ్యుకేషన్ కు పెట్టింది పేరు. ఇందులో ఏటా ఎంతోమంది వివిధ కోర్సులు చేస్తుంటారు. న్యూఢిల్లీ లోని ఈ ప్రఖ్యాత విద్యా సంస్థ 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ లో recruitment.nta.nic.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తులకు చివరితేది ఏప్రిల్‌ 20.

ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో దరఖాస్తులో సవరణలు చేసుకోవచ్చు. ఈ పోస్టుల అర్హతల విషయానికి వస్తే.. 10+2తో పాటు ఇంగ్లిష్‌, హిందీ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈ జాబ్ కు ఎంపికయ్యే వారికి నెలకు రూ.19,900- రూ.63,200 వరకు జీతం ఉంటుంది. దీనికి అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైపిస్ట్ పోస్టుకు నియామకం కావాలంటే టైపింగ్ టెస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి. అదే సమయంలో, హిందీ టైపింగ్ వేగం నిమిషానికి 35 పదాలు ఉండాలి.ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే..అన్ రిజర్వ్ డ్ కేటగిరి, ఓబీసీ (NCL), ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.600 ఉంది.దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ http://www.ignou.ac.in/ ను చూడొచ్చు.

రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులకు జాబ్స్..

రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో కాంట్రాక్టు జాబ్స్ చేసే అవకాశం. ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్, ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్, సపోర్ట్ ఆఫీసర్ హోదాతో 1031 పోస్టులను భర్తీ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమరావతి పరిధిలో 69 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 45 పోస్టులున్నాయి.

Also Read:  Accenture Delay : జాయినింగ్‌ ఆలస్యమయ్యే కొత్త ఉద్యోగులకు బోనస్‌