దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో ప్రజలు సతమతమవుతున్నారు. తాజాగా CNG ధరలను సైతం పెంచారు. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) CNG ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ధరలు పెరిగిన తర్వాత ఢిల్లీలో కేజీ CNG ధర రూ.79.56 గా ఉంది. నోయిడా, ఘజియాబాద్ లో రూ.82.12 గా ఉండగా, గురుగ్రామ్ లో రూ.87.89గా ఉంది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో ధరలు పెంచినట్లు ఐజీఎల్ తెలిపింది. @IGLSocial CNG రిటైల్ ధరను సవరించింది అని గ్యాస్ కంపెనీ ట్విట్టర్‌లో తెలిపింది. దేశ రాజధానిలో సిఎన్‌జి ధర 95 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.79.56కి చేరింది. అంతకుముందు ఈ ఏడాది అక్టోబర్ 8న ఢిల్లీలో సీఎన్‌జీ ధరలను కిలోకు రూ. 3 పెంచారు.
నగరాల వారీగా CNG ధరలు
– ఢిల్లీలో కేజీ CNG ధర రూ.79.56
– నోయిడా, గ్రేటర్ నోయిడా & ఘజియాబాద్‌లలో కేజీ CNG ధర రూ. 82.12.
– గురుగ్రామ్‌లో కేజీ CNG ధర రూ. 87.89.
– రేవారిలోకేజీ CNG ధర రూ. 89.57.
– కర్నాల్ & కైతాల్‌లోకేజీ CNG ధర రూ. 88.22.
– ముజఫర్‌నగర్, షామ్లీ & మీరట్‌లోని కొన్ని ప్రాంతాల్లో కేజీ CNG ధర రూ. 86.79.
– అజ్మీర్, పాలి & రాజసమంద్‌లలోకేజీ CNG ధర రూ. 89.83.
– కాన్పూర్, ఫతేపూర్ & హమీర్‌పూర్‌లలో CNG రిటైల్ ధర మారలేదు.
Also Read: Iphone 12: అతి తక్కువ ధరకే యాపిల్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?