Site icon HashtagU Telugu

FaceWash: ఆ నీళ్లతో ముఖం కడుక్కుంటే డేంజర్… ఏకంగా ప్రాణం కోల్పోయిన వ్యక్తి

Whatsapp Image 2023 03 02 At 19.40.53

Whatsapp Image 2023 03 02 At 19.40.53

FaceWash: ఈ భూమి మీద వింతలు ఎలా ఉన్నాయో.. పుట్టక, మరణాల్లోనూ అప్పుడప్పుడు వింతలు చోటు చేసుకుంటుంటాయి. ఆ ఘటనలు చూసినప్పుడు లేదా వివిధ మార్గాల ద్వారా తెలుసుకున్నప్పుడే సాధ్యమవుతోంది. ఇప్పుడు చెప్పబోయే ఘటన కూడా ఆ కోవకు చెందినదే. ట్యాప్ వాటర్ లో ముక్కు కడుకున్నందుకు ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ ప్లోరిడాలో చోటు చేసుకుంది.

ఇంట్లోని కుళాయి వద్ద అందరూ మెుఖం కడుగుతుంటారు. రోజు ఆ వ్యక్తి కూడా తన ముఖాన్ని శుభ్రం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ముక్కు ద్వారా శరీరంలోకి అమీబా ప్రవేశించింది. దీంతో అత్యంత అరుదుగా సోకే మదడును తినే అమీబా నెగ్లిరియా ఫౌలోరి కారణంగా అతను మరణించాడని అక్కడి వార్త సంస్థ ఒకటి వెల్లడించింది. ఇది సోకితే ఇక మరణమే శరణమని డాక్టర్లు అంటున్నారు.

నెగ్లేరియా ఫౌలెరి అనేది సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు వంటి మట్టి, వెచ్చని మంచినీటిలో నివసించే ఒక అమీబా. ఈ అమీబాతో కలుషితమైన నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు, అక్కడి నుంచి మెదడుకు చేరి మెదడు కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికాలో ప్రతి ఏడాది ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

1962 నుండి 2021 వరకు యునైటెడ్ స్టేట్స్‌ లో 154 మందికి సోకగా నలుగురు మాత్రమే ఈ వ్యాధి నుంచి
బయటపడ్డారు. మిగతా వారంతా మరణించారు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు కూడా జరుగుతున్నట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు.