Dental Doctor: ఇవి తీసుకుంటే డెంటల్ డాక్టర్ తో పని లేదు… అవి ఏవేంటే!

మన శరీరంలో అన్ని భాగాలు ఎంతో ముఖ్యం. కానీ కొందరు గుండె,చర్మం, రోగనిరోధక వ్య వస్థ,రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ముఖ్య మైనవంటుంటారు. కానీ నోటి సంరక్షణ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు.

  • Written By:
  • Updated On - March 20, 2023 / 11:43 PM IST

Dental Doctor: మన శరీరంలో అన్ని భాగాలు ఎంతో ముఖ్యం. కానీ కొందరు గుండె,చర్మం, రోగనిరోధక వ్య వస్థ,రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ముఖ్య మైనవంటుంటారు. కానీ నోటి సంరక్షణ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. నోటి శుభ్రతను పట్టించుకోకపోతే నోటి నుంచి దుర్వాసన, పంటి నొప్పి , చిగుళ్ల నుండి రక్తం ఇతర దంతాల సమస్యలు సంభవించవచ్చు.వరల్డ్ ఓరల్ హెల్త్ డేను ప్రతి సంవత్సరం మార్చి 20 న జరుపుకుంటారు.

ప్రపంచ నోటి సంరక్షణ దినోత్సవం సందర్భంగా దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి కొన్ని సూచనలు పాటించాలి. నోటి పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వా లని డాక్టర్లు సూచించారు.శుభ్రత మాత్రమే కాకుండా, పోషకాహారం కూడా దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది.నోటి ఆరోగ్యాన్ని ఏ ఆహారాలు మెరుగుపరుస్తాయో తెలుసుకుందాం.

చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ దంత సంరక్షణ చర్యలుపాటించాలి. రోజుకో ఆపిల్ తింటే ఆస్పత్రికి వెళ్లే అవసరం రాదని, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆపిల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆపిల్ కూడా దంతాలను శుభ్రం చేయడానికి పనికొస్తుంది.ఆపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అంతేకాకుండా అందులో ఉండే బ్యాక్టీరియాను తొలగించే లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది.