Sunday Special Dish: ఇదేందయ్యా ఇది.. ఆ హోటల్లో భోజనం చేయాలంటే 4 ఏళ్ళు ఆగాలట?

మామూలుగా మనం ఏదైనా హోటల్ కి కానీ లేదా రెస్టారెంట్ కి కానీ వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక పది నిమిషాలు లేదంటే 20 నిమిషాలలో తెచ్చి ఇస్

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 05:17 PM IST

మామూలుగా మనం ఏదైనా హోటల్ కి కానీ లేదా రెస్టారెంట్ కి కానీ వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒక పది నిమిషాలు లేదంటే 20 నిమిషాలలో తెచ్చి ఇస్తూ ఉంటారు. కొన్ని కొన్ని రెస్టారెంట్లో అంతకంటే తొందరగా కూడా చేసి ఇస్తూ ఉంటారు. కానీ రష్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఇంకా తయారు చేయాలి అన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు గంట లేదా రెండు గంటల సమయం కూడా పడుతూ ఉంటుంది. అంతసేపు వెయిట్ చేయాలి అని ఎవరు కూడా అనుకోరు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తినాలి అంటే ఇంకా నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలట. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.

ఇంతకీ ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది ఆ రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే.. ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ యూకే లో ఉంది. యూకేలోని ఒక చిన్న పబ్ లో ఆదివారం టేబుల్ బుక్ చేసుకోవడం అంత సులువు కాదు. యూకేలోని బ్రిస్టల్‌లో ఉన్న ది బ్యాంక్ టావెర్న్ అనే చిన్న పబ్ ఉంది. ఇక్కడ ఆదివారం రోజున భోజనాన్ని బుక్ చేసుకొని ఆస్వాదించడమంటే బ్రహ్మాండం అన్నంత పని. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసే సండే రోస్ట్‌ల కోసం ఏకంగా 4 సంవత్సరాల పాటు వేచి చూడాలి మరి. అక్కడి రెస్టారెంట్ బుకింగ్ నిపుణులు యూకేలోనే సుధీర్ఘ వెయిటింగ్ లిస్టు ఉన్న పబ్‌గా దీన్ని గుర్తించారు.

Special Dish

అయితే కరోనా సమయంలో దేశవ్యాప్తంగా చాలా వరకు పబ్‌లు, రెస్టారెంట్‌లు మూసివేయాల్సి వచ్చింది. దీంతో ఈ పబ్‌లో సండే రోస్ట్‌ల కోసం జరిగినటువంటి ముందస్తు బుకింగ్స్ వెయిటింగ్ లిస్ట్ అమాంతం పెరిగిపోయింది. అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళు సండే రోస్టులు ఆస్వాదించాలంటే మాత్రం నాలుగేళ్ల వరకు ఆగాల్సిందేనట. ఇక్కడ రోస్టులు చాలా ప్రత్యేకం. అందులో ప్రత్యేకమైన వంటకాలు వడ్డిస్తారట. 2018లోనే బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డ్స్‌ తో ఉత్తమ సండే లంచ్‌గా ఇది ఎంపిక అయ్యింది. 2019లో ఈ చిన్న పబ్ అబ్జర్వర్ ఫుడ్ మంత్లీ అనే అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుందంటే దాని ఇమేజ్ మనం అర్ధం చేసుకోవచ్చట.