Farming: ఆ పంటతో ఎకరం పొలంలో నెలకు రూ.2లక్షల ఆదాయం?

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో టెక్నాలజీకి అనుగుణంగా కొందరు వ్యవసాయంలో మంచి మంచి పద్ధతులను అవలంబిస్తూ లక్షల్లో సంపాదిస్తు

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 06:45 PM IST

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో టెక్నాలజీకి అనుగుణంగా కొందరు వ్యవసాయంలో మంచి మంచి పద్ధతులను అవలంబిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. కొందరు సేంద్రియ వ్యవసాయంతో పండిస్తుండగా మరికొందరు ఆలోచనలతో పంటలు పండించుకుని లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. బీహార్ లో కూడా ఒక రైతు ఎకరం పొలంలో నెలకు దాదాపుగా రూ. రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అయితే ఆ రైతు తన పొలంలో ఏమి సాగు చేస్తున్నాడు. ఆదాయాన్ని ఎలా పొందుతున్నాడు అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బీహార్ లోని సమస్తిపూర్ జిల్లా వ్యవసాయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ ప్రదేశంలో ఎక్కువగా మామిడి లిచ్చి అరటి పండ్లతో పాటుగా కూరగాయలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడ పండించిన పంటలను రాజధాని పాట్నాకు సరఫరా చేస్తూ ఉంటారు. కొందరు రైతులు ఈ విధంగా సాగు చేస్తూ లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఆ విధంగా కూరగాయల సాగు చేస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచాడు ఒక రైతు. సమస్తిపూర్ లోని మధురాపూర్ తారా గ్రామానికి చెందిన దీనదయాల్ రాయ్ అనే రైతు కూరగాయల సాగుతూ రెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏ పంటను సాగు చేస్తున్నాడు అన్న విషయానికి వస్తే..

తనకున్న ఒకటిన్నర ఎకరా భూమిలో గుమ్మడి వేశాడు. సాంప్రదాయ పంటలతో పోలిస్తే కొంత తక్కువే లాభం పొందుతున్నట్టు తెలిపాడు. ఇతని పొలాల్లో ఉండే కూరగాయలకు గిరాకీ ఉండటంతో ఇతర జిల్లాల నుంచి కూడా గుమ్మడికాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎక్కువగా వస్తున్నారట. అయితే సేంద్రియ పద్ధతిలో గుమ్మడికాయ సాగు చేస్తున్నట్లు రైతు దీనదయాల్ తెలిపారు. తన పొలంలో ఎప్పుడు కూడా రసాయనక ఎరువులు వాడలేదని, తన పొలంలో పండించే కూరగాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని తెలిపాడు దీనదయాల్. తను పండించే ఒక గుమ్మడికాయను 30 నుంచి 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఆ విధంగా నెలలో దాదాపు 6,400 గుమ్మడికాయలను విక్రయించి రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాడు.