Site icon HashtagU Telugu

Box Cleaning Tips: ప్లాస్టిక్‌ లంచ్ బాక్స్‌ను ఇలా క్లీన్ చేస్తే మరకలు పోతాయి

Plastic Lunch Box Cleaning Tips

Plastic Lunch Box Cleaning Tips

Box Cleaning Tips: ప్లాస్టిక్ వినియోగం ఇంకా విపరీతంగా పెరుగుతూనే ఉంది. తక్కువ ధరకు మార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో ప్లాస్టిక్‌ వస్తువలను ఇంకా వాడుతూనే ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌లను కూడా చాలామంది వాడుతూ ఉంటారు. తమ పిల్లలకు ప్లాస్టిక్ లంచ్ బాక్స్ లో భోజనం పెట్టి పంపిస్తారు. ఇక వివిధ తినుబండారాలు లాంటివి ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి స్కూల్ కి పంపిస్తారు. అలాగే ఉద్యోగోలు కూడా మధ్యాహ్నం లంచ్ కోసం ప్లాస్టిక్ బాక్స్ లో ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తారు.

అయితే ప్లాస్టిక్ బాక్స్ లకు మరకలు వెంటనే అంటుకుంటాయి. అంతేకాకుండా మరకలు వెంటనే పోవు. ఆయిల్, కారం లాంటి పదార్ధాలు ప్లాస్టిక్ వస్తువులకు అంటుకుంటే వెంటనే పోవు. సబ్బుతో చాలా గట్టిగా వాష్ చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌లు పాడైపోతాయి. అయితే ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌ను సులభంగా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ప్లాస్టిక్ లంచ్ బాక్స్‌ను వెనిగర్ ఉపయోగించి శుభ్రం చేయాలి. దీని వల్ల వాసనతో పోవడంతో పాటు నిమిషాల్లో శుభ్రం అవుతుంది. ఒక గ్లాసు నీళ్లలో వెనిగర్ మిక్స్ చేసి లంచ్ బాక్స్‌లో వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత లిక్విడ్ డిటర్జెంట్ తో శుభ్రం చేయాలి. దీని వల్ల లంచ్ బాక్స్ త్వరగా క్లీన్ అవ్వడంతో పాటు వాసన పోతుంది. ఇక లిక్విడ్ క్లోరిన్ బ్లీచ్ ద్వారా కూడా ప్లాస్టిక్ లంచ్ బాక్స్ ను శుభ్రం చేయవచ్చు. ఇందుకోస లిక్విడ్ క్లోరిన్ బ్లీచ్‌ను నీళ్లలో కలిపి లంచ్ బాక్స్‌ను కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేస్తే దుర్వాసన పోవడంతో పాటు కొత్తదానిలా మెరిసిపోతుంది.

ఇక బేకింగ్ సోడా కూడా బాగా శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. నీటిని కొంచెం వేడి చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. తర్వాత వాటిల్లో లంచ్ బాక్స్‌ను కాసేపు ఉంచి తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.