Site icon HashtagU Telugu

Indian Railway: రైల్వే పై దాడులు చేస్తే ఇక జైలుకే

Vande Bharath

Vande Bharath

రైల్వే ఆస్తులకు భంగం కలిగిస్తే ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. రైల్వే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అయితే సందర్భానుసారం కేసులు పెట్టే విషయంలో రైల్వే అధికారులు ఉదారంగా ఉంటే మాత్రం తప్పు చేసినవారు కూడా తప్పించుకుంటారు. కానీ ఇకపై ఇలాంటివేవీ కుదరవంటున్నారు రైల్వే అధికారులు. రైళ్లపై రాళ్లు వేసినా సరే కఠిన శిక్షలు అమలు చేస్తామంటున్నారు. సాధారణ రైళ్లపై రాళ్లు వేస్తే ఆస్తి నష్టం పెద్దగా జరగదు, ప్రయాణికులకు రాళ్లు తగిలితే మాత్రం కష్టమే.

ఇప్పుడు వందే భారత్ సీజన్ నడుస్తోంది. మొత్తం అద్దాలతో ఉండే ఆ రైలుపై రాయి పడితే మాత్రం ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది. పైగా అది రైల్వేకి ప్రెస్టేజ్ ఇష్యూ. అసలే ఆవుల్ని, గేదెల్ని ఢీకొంటూ నిత్యం వందే భారత్ వార్తల్లో రైలుగా మారింది. పదే పదే రాళ్లదాడి ఘటనలు కూడా వెలుగులోకి రావడం, అద్దాలు పగలడంతో వందే భారత్ విషయంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. రాళ్లు రువ్వే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తోంది. రైళ్లపై రాళ్లు విసిరితే రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.