Koppula: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం!

  • Written By:
  • Publish Date - June 23, 2024 / 07:22 PM IST

Koppula: బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఇవాళ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు అని, తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని, దక్షిణ భారతానికే వెలుగురేఖ అని, తెలంగాణ ప్రాంతంలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ అని అన్నారు. లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ…! అనేక పరిశ్రమలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డ సంస్థ సింగరేణి సంస్థ అని ఈశ్వర్ అన్నారు.

‘‘133 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సంస్థలో లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రముఖంగా నిలిచినటు వంటి సంస్థ సింగరేణి సంస్థ అని, అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో నిర్వహిస్తూ, ఒకనాడు తీవ్రమైన నష్టాల్లో ఉన్నటువంటి ఈ సంస్థ కార్మికులు మరియు యాజమాన్యం సమిష్టి కృషితో అనేక సంవత్సరాలుగా లాభాలను ఆర్జించిన సంస్థ సింగరేణి సంస్థ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ కూడా దీనిని ప్రవేట్ పరం చేయవలసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని, ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గుడ్డలు పెట్టు లాంటిది అని మాజీ మంత్రి అన్నారు.