Medigadda: పిల్లర్లు కుంగిపోతే రాజకీయాలు చేస్తున్నారు : పోచారం

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 01:09 AM IST

Medigadda: బీఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్‌ భూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు. పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సిందిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మేడిగడ్డ దగ్గర ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 86 పిల్లర్లకు 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని సరిచేయాలన్నారు. సాంకేతిక సమస్యను రాజకీయ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ‘కాళేశ్వరంలో మొత్తం196 స్కీం ఉన్నాయి. మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారన్నారు.