Site icon HashtagU Telugu

BRS Party: ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతాం: బోయినపల్లి వినోద్

Brs Ex Mp Vinod Kumar Comme

BRS Party: రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ,యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5000ల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని…కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

మానకొండూర్ నియోజకవర్గములోని ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో ఎండిన వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిందని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మూడు పిల్లర్లు కుంగితే దానిని సాకుగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండబెట్టి , సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీరు పెట్టిస్తోందని పేర్కొన్నారు.

రైతులు ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు ₹25వేల పంట నష్ట పరిహారం అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు క్వింటాలుకు ₹500 బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు ₹15000ల సాయం, ₹2లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు.

Exit mobile version