Site icon HashtagU Telugu

PM Modi-Obama : మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. ఇండియా ముక్కలయ్యే ముప్పు : ఒబామా

Pm Modi Obama

Pm Modi Obama

PM Modi-Obama : భారత్ లో ముస్లిం మైనార్టీల హక్కుల ఉల్లంఘనపై  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు.. 

ఒకవేళ తాను ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని దీనిపై ప్రశ్నించి ఉండేవాడినని చెప్పారు. 

భారత్ లో ముస్లిం మైనార్టీల కు లభిస్తున్న రక్షణ అంశాన్ని మోడీ ఎదుట  ప్రస్తావించి ఉండేవాడినని ఆయన తెలిపారు.      

బైడెన్, నరేంద్ర మోడీ కలిసి వాషింగ్టన్ లోని వైట్ హౌస్ వద్ద  సంయుక్త పత్రికా ప్రకటన చేయడానికి కొన్ని గంటల ముందు.. CNN యొక్క క్రిస్టియన్ అమన్‌పూర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో  బరాక్ ఒబామా(PM Modi-Obama) ఈ వ్యాఖ్యలు చేశారు.  మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. భారతదేశం ఏదో ఒక సమయంలో ముక్కలవడానికి బలమైన అవకాశం ఉంటుందని ఆయన కామెంట్ చేశారు.  “భారత్ లో భారీ స్థాయిలో అంతర్గత వైరుధ్యాలు పెరిగిపోతే ఏం  జరుగుతుందో గతంలో మనం చూశాం” అని పేర్కొన్నారు. “హిందువులు మెజారిటీ గా ఉన్న భారతదేశంలో ముస్లిం మైనారిటీల రక్షణ అనేది మోడీ ఎదుట బైడెన్ కచ్చితంగా  ప్రస్తావించాల్సిన విషయం” అని ఒబామా అభిప్రాయపడ్డారు. బరాక్ ఒబామా ఇంటర్వ్యూ క్లిప్‌ను కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రినతే ట్విట్టర్ లో షేర్ చేశారు.

Also read : 800 Crore For Stone Pelting : కాశ్మీర్ లో రాళ్లదాడులకు 800 కోట్లు.. పాక్ ఫండింగ్ బండారం బట్టబయలు

మా దేశంలో వివక్షకు స్థానం లేదు : మోడీ 

మరోవైపు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ..  భారతదేశంలో  వివక్షకు స్థానం లేదని స్పష్టం చేశారు.  ప్రజాస్వామ్య రక్తం తమ నరనరాన ప్రవహిస్తోందని  చెప్పారు. “మనది ప్రజాస్వామ్యం… భారతదేశం, అమెరికా రెండింటి  DNAలోనూ ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం మా ఆత్మలో ఉంది . కులం, మతం ప్రాతిపదికన వివక్షకు ఖచ్చితంగా చోటు లేదు”అని మోడీ తెలిపారు.