Tamil Nadu: మరోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం అంతమే

కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

Published By: HashtagU Telugu Desk
Tamil Nadu

New Web Story Copy (59)

Tamil Nadu: కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఎవరూ కాపాడలేరని చెప్పారు డీఎంకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌. డీఎంకే బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి స్టాలిన్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది లోక్‌సభకు జరగనున్న ఎన్నికల తర్వాత ఎవరు అధికారం చేజిక్కించుకోవాలి అనే దానికంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండకూడదనేదే అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు. పుదుచ్చేరిలోని ఒక్క సెగ్మెంట్‌తో పాటు తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాల్లో డీఎంకే మరియు మిత్రపక్షాలు తప్పక గెలవాలని సూచించారు. సంక్షేమ పథకాల గురించి ప్రజలతో మాట్లాడాలని, ప్రచారానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్టాలిన్ తమ పార్టీ పోలింగ్ స్టేషన్ల ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడితే ఒక్క తమిళనాడు మాత్రమే కాదు, భారతదేశాన్ని ఎవరూ రక్షించలేరని అభిప్రాయపడ్డారు.

Also Read: Andhra Pradesh : ఏపీలో భారీ వ‌ర్షాలు.. విద్యాసంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

  Last Updated: 27 Jul 2023, 11:26 AM IST