Site icon HashtagU Telugu

Hurricane Idalia: అమెరికాకు తప్పని ముప్పు.. ముంచుకొస్తున్న ఇడాలియా?

Hurricane Idalia

Hurricane Idalia

ప్రస్తుతం అమెరికా ఒకదాని తర్వాత ఒకటి వరుస విపత్తులతో అతలాకుతులమవుతోంది. వరుస విపత్తులు అమెరికాను వేధిస్తున్నాయి. హరికేన్ ఇడాలియా, ఫ్లోరిడా తీరంవైపు దూసుకొస్తోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ హరికేన్ ప్రస్తుతం కేటగిరీ-3 తుపానుగా మారింది. కొద్దిగంటల్లో ఇది ఫ్లోరిడా తీరాన్ని తాకనుంది. దాంతో లోతట్టు ప్రాంత ప్రజలను స్థానిక యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది.

ఈ హరికేన్ కారణంగా 120 mph వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ హరికేన్ ప్రమాదకర తుపానుగా మారడంతో తీరాన్ని తాకే వేళ బీభత్సం సృష్టిస్తుందని జాతీయ వాతావారణ శాఖ హెచ్చరించింది. ఇది కేటగిరీ 4గానూ మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఈ సమయంలో సూపర్‌ మూన్ అధికారులను మరింత కలవరపెడుతోంది. హరికేన్ తీరాన్ని తాకే వేళ ఈ బ్లూ మూన్ ఏర్పడుతుండటంతో తుపాను తీవ్రత మరింత పెరగనుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

జాబిల్లి చంద్రుడికి సమీపించిన సమయంలో గురుత్వాకర్షణ తీవ్రత అధికంగా ఉండటంతో సముద్రం ఆటుపోట్లకు గురవుతుంది. ఇప్పుడు ఈ పౌర్ణమి ఎఫెక్ట్‌ ఫ్లోరిడాతో పాటు జార్జియా, సౌత్‌ కరోలినాపై కూడా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచినట్లు ఫ్లోరిడా గవర్నర్ రాన్‌ డిసాంటిస్‌ వెల్లడించారు.