ICAI CA Result 2024: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI CA Result 2024) దీపావళి సాయంత్రంలోపు CA ఫౌండేషన్ ఫలితాలను విడుదల చేయనుంది. CA ఇంటర్ ఫలితాలు నవంబర్ 15 నాటికి విడుదల చేయనున్నారు. ఫలితం విడుదలైన తర్వాత విద్యార్థులు CA ఇంటర్, ఫౌండేషన్ స్కోర్ కార్డ్‌లను అధికారిక ICAI వెబ్‌సైట్ – icai.org లేదా icaiexam.icai.orgలో తనిఖీ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రకటనను ICAI సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు (CCM) ధీరజ్ ఖడేల్వాల్ తన అధికారిక ‘X’ ఖాతా ద్వారా ప్రకటించారు. దీపావళికి ముందే ప్రకటించగలం.. సెప్టెంబర్ సీఏ ఇంటర్ ఫలితాలు నవంబర్ మధ్యలో విడుదలవుతాయి అని ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం.. CA ఇంటర్మీడియట్ పరీక్షలు సెప్టెంబర్ 12- సెప్టెంబర్ 23 మధ్య జరిగాయి. ICAI CA గ్రూప్ 1 పరీక్షలు సెప్టెంబర్ 12, 14, 17 తేదీలలో.. గ్రూప్ 2 పరీక్షలు సెప్టెంబర్ 19, 21, 23 తేదీలలో జరిగాయి. అయితే ఫౌండేషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా 13, 15, 18, 20 తేదీలలో జరిగాయి.
Also Read: BRICS Vs US Dollar : అమెరికా డాలర్ వర్సెస్ బ్రిక్స్ కరెన్సీ.. పుతిన్ కీలక ప్రకటన
ICAI జనవరి 2025 పరీక్ష తేదీలను ప్రకటించింది
మరోవైపు ICAI జనవరి 2025 పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఫౌండేషన్ కోర్సు పరీక్షలు 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ కోర్సు పరీక్షలు గ్రూప్ I కోసం జనవరి 11, 13, 15 తేదీలలో.. గ్రూప్-2 కోసం జనవరి 17, 19, 21 తేదీలలో నిర్వహించబడతాయి.
స్కోర్ కార్డ్‌ని ఎలా చెక్ చేయగలరు?
- తొలుత అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.orgకి వెళ్లండి.
- ఆ తర్వాత హోమ్ పేజీకి వెళ్లి అక్కడ ఉన్న రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ వంటి వివరాలను పూరించండి.
- వెంటనే స్కోర్ మీ కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- మీ స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ ఉపయోగం కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.