Site icon HashtagU Telugu

IAS Officers Transfer : తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ లు బదిలీ..ఆమ్రపాలికి కీలక పదవి

Ghmc Commissioner Amrapali

Ghmc Commissioner Amrapali

తెలంగాణ (Telangana) లో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ (IAS Officers Transfer) జరిగింది. ఇప్పటికే పలువురు అధికారులను బదిలీ చేయగా..తాజాగా మరో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యంగ్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా (amrapali kata)కు కీలక పదవి దక్కడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

ఆమెకు కొన్ని బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం.. చివరికి కీలక పదవిలోనే కూర్చోబెట్టింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిశోర్ ను నియమించగా.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, HMDA జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్సవ, హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పెయిని బదిలీ చేసింది. ఇక ఆమ్రపాలి కి హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్, మూసి రివర్ డెవలప్మెంట్ బాధ్యతలను తొలగించింది. జీహెచ్ఎంసి కమిషనర్‌గా ఆమ్రపాలి కాటాకు పూర్తి బాధ్యతలు అప్పగించింది.

Read Also : Warren Buffett: లిప్ స్టిక్ కంపెనీలో వారెన్ బఫెట్ పెట్టుబడులు, దిగ్గజాలు షాక్